AP News: ఉత్కంఠ రేపుతున్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై హైకోర్టు స్టే

తాజా వార్తలు

Published : 08/10/2021 02:39 IST

AP News: ఉత్కంఠ రేపుతున్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై హైకోర్టు స్టే

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నిక వాయిదా వేయాలన్న తెలుగుదేశం ఎంపీపీ అభ్యర్థి షేక్‌ జబీన్‌ వినతిని పరిశీలించిన హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జబీన్‌ కుల ధ్రవీకరణ పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం వారం రోజుల గడువు విధించింది. ఆ తర్వత ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. తెలుగుదేశం 9, వైకాపా 8, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. బీసీలకు ఎంపీపీ పదవి రిజర్వ్‌ కాగా, తెలుగుదేశం నుంచి గెలిచిన ఏకైక బీసీ అభ్యర్థి షేక్‌ జబీన్‌కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రెండు సార్లు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టినా తెలుగుదేశం సభ్యులు హాజరు కాకపోవడంతో కోరం లేక వాయిదా పడింది. మరో వైపు దుగ్గిరాల ఎంపీపీ పదవిని తెదేపా కైవసం చేసుకుంటుందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరగాల్సిన ఎంపీపి ఎన్నికను న్యాయస్థానం వారం రోజులు వాయిదా వేయడంపై ఆపార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని తెలుగుదేశం నేతలు విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని