ప్రభుత్వాన్ని సంప్రదించాకే ప్రైవేటీకరణ: అచ్చెన్న

తాజా వార్తలు

Published : 10/03/2021 01:41 IST

ప్రభుత్వాన్ని సంప్రదించాకే ప్రైవేటీకరణ: అచ్చెన్న

విశాఖ: ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయోజనాల కోసం సీఎం వెంట ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే విశాఖ ఉక్కుపై ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించారా? ఏనాడైనా దిల్లీ వెళ్లి మాట్లాడారా? ఇప్పుడు అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్తానంటే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. 23 మంది ఎంపీలు ఉన్నా మాట్లాడేందుకు ప్రధాని సమయం ఇవ్వరా? అని నిలదీశారు.

సీఎం జగన్‌కు స్టీల్‌ ప్లాంట్‌ భూములపై ఉన్న ఆశ త్యాగాలపై లేదని.. ఆయన చెప్పే ప్రతి మాటా అబద్ధమేనన్నారు. జగన్‌ రాసే లేఖలు దిల్లీలో పట్టించుకునే వారు ఎవరూ లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ప్రైవేటీకరణ చేపట్టినట్లు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2003లోనే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు యత్నించారని.. అప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఎర్రన్నాయుడు పోరాడి ఆపారని గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని