రఘురామ అరెస్టుతీరు సరికాదు: అచ్చెన్న

తాజా వార్తలు

Published : 15/05/2021 01:11 IST

రఘురామ అరెస్టుతీరు సరికాదు: అచ్చెన్న

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. అరెస్టు తీరు సరికాదని విమర్శించారు. రఘురామ ప్రశ్నలకు జవాబివ్వలేకే అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని ఆరోపించారు. వారెంట్‌ లేకుండా ఎంపీని ఎలా అరెస్టు చేస్తారని  ప్రశ్నించారు. ‘‘ రూల్‌ ఆఫ్‌ లాను నిర్వీర్యం చేస్తూ భయపెడుతున్నారు. కక్ష సాధింపునకు సీఐడీని ఆయుధంగా వాడుతున్నారు. ఎంపీ అరెస్టుకు స్పీకర్‌, కేంద్ర హోంశాఖ అనుమతి ఉందా? గుండె సర్జరీ చేయించుకున్న వ్యక్తిపై మానవత్వమైనా చూపించాలి కదా.’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు సీఐడీ దోషిగా నిలబడక తప్పదని తెలిపారు.

ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ హైదరాబాద్‌లో ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే. 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆయనపై అభియోగం మోపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని