‘‘Lockdown పెడితేనే ప్రాణాలు నిలుస్తాయి’’

తాజా వార్తలు

Updated : 08/05/2021 12:32 IST

‘‘Lockdown పెడితేనే ప్రాణాలు నిలుస్తాయి’’

తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 

విశాఖపట్నం: కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పా? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సలహాలు తీసుకోకుండా తమపైనే విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ కొరతపై తెదేపా ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టింది. ఇళ్ల వద్దే ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆ పార్టీ నేతలు, నాయకులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా విశాఖలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ముఖ్యం. కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. కరోనా మృతుల బంధువుల ఆర్తనాదాలు సీఎంకు వినిపించడం లేదా.?ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపులా? పూర్తి లాక్‌డౌన్‌ పెడితేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయి’’అని అచ్చెన్న అన్నారు. 

‘‘ప్రజలకు కావాల్సింది తాయిలాలు కాదు.. టీకాలు. నమ్మి ఓటేసిన ప్రజలను మోసగించకుండా పరిపాలన చేయాలి. ప్రశ్నించే వారిపై కేసులు కాదు.. సమస్యలను అరికట్టడంపై చర్యలు తీసుకోవాలి’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయన్న పాత్రుడు మండిపడ్డారు. 

ప్రభుత్వం విఫలం: శ్రావణ్‌కుమార్‌

కొవిడ్‌ టీకా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ మేరకు గుంటూరు తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవిస్తుంటే సీఎం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని