దొంగ ఓట్లపై వైకాపాకు అచ్చెన్న సవాల్‌

తాజా వార్తలు

Updated : 20/04/2021 10:23 IST

దొంగ ఓట్లపై వైకాపాకు అచ్చెన్న సవాల్‌

వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలన్న తెదేపా

అమరావతి: వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఉప ఎన్నికలో వైకాపా దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా దొంగ ఓట్లు వేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అని వైకాపాకు సవాల్‌ విసిరారు. ‘‘ దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. ఒక్క దొంగ ఓటు కూడా పడలేదని వైకాపా నేతలు వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా?దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. తిరుపతి ఉప ఎన్నికలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు పడ్డాయి’’ అని అచ్చెన్న అన్నారు. 

తిరుపతి లోక్‌సభ స్థానానికి ఈ నెల 17న జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించిందని తెదేపా తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనిపై స్పందించిన వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలవి తప్పడు ఆరోపణలు అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని