AP news: నవ్యాంధ్రను హత్యాంధ్రగా మార్చారు: అచ్చెన్న

తాజా వార్తలు

Updated : 24/06/2021 12:44 IST

AP news: నవ్యాంధ్రను హత్యాంధ్రగా మార్చారు: అచ్చెన్న

అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌ను వైకాపా ప్రభుత్వం హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో తెదేపా కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైకాపా అరాచకాలపై సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవని గుర్తించాలని, ఎవరిదో అండ చూసుకొని రెచ్చిపోయే గూండాలు భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 27మంది తెదేపా కార్యకర్తలను బలితీసుకుందని, మరో 1400మందికిపైగా దాడులు జరిగితే పోలీసులకు కనిపించట్లేదా? అని ఆయన దుయ్యబట్టారు. హత్యలకు కారకులైన ఏ ఒక్కరినైనా శిక్షించారా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే హత్యలతో రక్తపాతం చేస్తూ ఏదో ఒక అల్లరి సృష్టిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలతో కలకలలాడాల్సిన రాష్ట్రం.. దాడులు, హత్యలతో విలవిల్లాడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని