బెంగాల్‌ ఎన్నికలు: భాజపా ఏజెంట్‌ హఠాన్మరణం

తాజా వార్తలు

Published : 17/04/2021 11:32 IST

బెంగాల్‌ ఎన్నికలు: భాజపా ఏజెంట్‌ హఠాన్మరణం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. 45 స్థానాల పరిధిలో ఉదయం 09:30 గంటల సమయానికి 16.15శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇటీవల నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా కోచ్‌బిహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

భాజపా బూత్‌ ఏజెంట్‌ హఠాన్మరణం
కమర్‌హాతీ ప్రాంతంలోని 107వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో భాజపా ఏజెంట్‌ హఠాత్తుగా మృతి చెందడం కలకలం సృష్టించింది. దీంతో అతడి మృతిపై నివేదిక సమర్పించాలని ఈసీ.. ఎన్నికల సిబ్బందిని ఆదేశించింది. ఉత్తర బర్దమాన్‌ అసెంబ్లీ పరిధిలో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తమ బూత్‌ ఏజెంట్లపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. పలు చోట్ల సీఆర్పీఎఫ్‌ జవాన్లు పోలింగ్‌ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని టీఎంసీ ఆరోపించింది. 

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి నాలుగో దశలో భాగంగా మొత్తం 45 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 342 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఆరు జిల్లాల పరిధిలో 15,789 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని