ఏపీలో ప్రత్యామ్నాయం భాజపానే!

తాజా వార్తలు

Updated : 03/04/2021 13:09 IST

ఏపీలో ప్రత్యామ్నాయం భాజపానే!

తిరుపతి ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌

కపిలతీర్థం: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో భాజపా ప్రచారాన్ని వేగవంతం చేసింది. కపిలతీర్థంలో భాజపా-జనసేన సంయుక్తంగా ప్రచారం నిర్వహించాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జనసేన తరఫున పసుపులేటి హరిప్రసాద్‌ ప్రచారంలో పాల్గొన్నారు. రాజకీయ రణరంగం నుంచి తెదేపా పక్కకు తప్పుకుందని, రాష్ట్రంలో భాజపానే ప్రత్యామ్నాయమని రఘునందన్‌రావు అన్నారు. వైకాపాకు ఓటేస్తే సంఖ్య పెరుగుతుంది తప్ప.. అభివృద్ధి ఉండదని అన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారాలు, అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా చట్టం తీసుకొస్తామన్నారు. సాంకేతికత ఉన్నా విగ్రహాలు ధ్వంసం చేసే వారిని పట్టుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి మతప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఈ నెల 17న పోలింగ్‌ జరగనుంది.కాగా, భాజపా-జనసేన అభ్యర్థిగా రత్నప్రభ, తెదేపా నుంచి పనబాక లక్ష్మి, వైకాపా నుంచి గురుమూర్తి బరిలో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని