జనం ప్రశ్నిస్తారనే జగన్‌ పర్యటన రద్దు: భాజపా

తాజా వార్తలు

Published : 11/04/2021 12:52 IST

జనం ప్రశ్నిస్తారనే జగన్‌ పర్యటన రద్దు: భాజపా

తిరుపతి: జనం ప్రశ్నిస్తారనే సీఎం జగన్‌ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని భాజపా విమర్శించింది. కరోనా పేరుతో జగన్‌ ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తుపై ప్రశ్నించిన ఆయన కూతురు సునీతపై కేసు పెట్టగలరా అని నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు నాయుడుపేట బహిరంగ సభలో పాల్గొంటారని సీఎం రమేశ్‌ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని