‘బెంగాల్‌లో భాజపా ఓటమికి కారణం వారే’

తాజా వార్తలు

Updated : 19/07/2021 12:39 IST

‘బెంగాల్‌లో భాజపా ఓటమికి కారణం వారే’

పార్టీ కీలక నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమిపై ఆ పార్టీ కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకుల అతితెలివి, అతివిశ్వాసం వల్లే పార్టీ ఓటమిపాలైందని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వ మేదినీపూర్‌ జిల్లాలోని చందీపూర్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘తొలి రెండు విడతల పోలింగ్‌లో భాజపాకు భారీ మద్దతు లభించింది. దీంతో మన నేతలు కొంతమంది అతివిశ్వాసం, అతి తెలివి ప్రదర్శించారు. భాజపా 170-180 సీట్లు గెలుచుకుంటుందని నమ్మడం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పని చేయడంపై నిర్లక్ష్యం వహించారు. అందువల్లే మనం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’’ అని సువేందు వ్యాఖ్యానించారు.

సువేందు అధికారి వ్యాఖ్యలపై అధికార తృణమూల్‌ స్పందించింది. భాజపా ఓటమికి సువేందు ఇతరుల్ని ఎందుకు బాధ్యుల్ని చేస్తున్నారని తృణమూల్‌ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ ప్రశ్నించారు. సువేందు సైతం తమ పార్టీ 200 సీట్లకు పైగా గెలుచుకుంటోందని కలల్లో విహరించలేదా?అని ఎద్దేవా చేశారు. అలాగే ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని చూసే ఓటేశారన్నారు. ఈ విషయాన్ని భాజపా విస్మరిస్తోందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని