Bengal politics: బెంగాల్‌లో భాజపాకు మరో షాక్‌

తాజా వార్తలు

Published : 05/09/2021 01:12 IST

Bengal politics: బెంగాల్‌లో భాజపాకు మరో షాక్‌

టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే సౌమెన్‌ రాయ్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో భాజపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)ను వీడి భాజపాలో చేరిన కాలియాగంజ్‌ ఎమ్మెల్యే సౌమెన్‌రాయ్‌ శనివారం తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. రాష్ట్రంలోని భవానీపూర్‌ ఉప ఎన్నికతోపాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడిన రోజే ఆయన భాజపాను వీడటం గమనార్హం. కోల్‌కతాలో టీఎంసీ జనరల్‌ సెక్రెటరీ పార్థ ఛటర్జీ సమక్షంలో తృణమూల్‌లో చేరారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఆయన టీఎంసీలో చేరినట్లు ఛటర్జీ పేర్కొన్నారు. బెంగాల్‌ శాసనసభ ఎన్నికలకు ముందు తృణమూల్‌కు చెందిన పలువురు కీలక నేతలు భాజపాలో చేరిన విషయం తెలిసిందే. వారిలో కొందరు మళ్లీ టీఎంసీలోకి వచ్చి చేరుతున్నారు. ఇటీవలే విష్ణుపూర్‌ ఎమ్మెల్యే తన్మోయ్‌ ఘోష్‌, బాగ్దా ఎమ్మెల్యే విశ్వజిత్‌ దాస్‌ టీఎంసీ బాటపట్టారు. అంతకుముందు భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ముకుల్‌ రాయ్‌.. మళ్లీ మమతా సమక్షంలో టీఎంసీలో చేరారు. ప్రస్తుతం ఆయన కృష్ణానగర్‌ ఉత్తర్‌ ఎమ్మెల్యే. ఎన్నికల్లో కాషాయ కూటమి మొత్తం 77 సీట్లు గెలుచుకోగా.. ప్రస్తుతం ఈ బలం 71 స్థానాలకు పడిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని