కరోనాతో భాజపా ఎంపీ కన్నుమూత!

తాజా వార్తలు

Updated : 02/03/2021 15:14 IST

కరోనాతో భాజపా ఎంపీ కన్నుమూత!

దిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియర్‌ నేత, లోక్‌సభ సభ్యుడు నంద్‌కుమార్‌ సింగ్ చౌహాన్‌ అనారోగ్య కారణాలతో మంగళవారం కన్నుమూశారు. అయితే, ఆయన ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడటంతో.. దిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నంద్‌కుమార్‌ సింగ్‌ మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఈయన ఖండ్వా నుంచి లోక్‌సభకు నాలుగుసార్లు గెలిచారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ సేవలందించారు. 2009-2014 మధ్య కాలాన్ని మినహాయిస్తే.. 1996 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎంపీగా ఉన్నారు. 

కాగా, నంద్‌కుమార్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధ్యప్రదేశ్‌లో భాజపా బలోపేతానికి ఆయన గొప్ప సేవలు అందించడమే కాకుండా.. పార్లమెంటు కార్యకలాపాల్లోనూ చొరవతో తనదైన ముద్ర వేసుకున్నారని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సన్నిహితుడిని కోల్పోయానంటూ ట్వీట్‌ చేశారు. నంద్‌కుమార్‌ సిద్ధాంతాల కోసం అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని