రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ కోర్టు

తాజా వార్తలు

Published : 28/04/2021 01:19 IST

రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.

నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్‌ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ తెలిపారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్‌ వేయడంతో తాజాగా తన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి, సీబీఐకి నోటీసులు ఇస్తారని రఘురామ పేర్కొన్నారు.  ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని ఆయన వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని