భాజపావి ఎన్నికల వాగ్దానాలు మాత్రమే: మమతా

తాజా వార్తలు

Updated : 03/02/2021 04:31 IST

భాజపావి ఎన్నికల వాగ్దానాలు మాత్రమే: మమతా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. భాజపా నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వాగ్దానాలు చేస్తారు.. ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా మాయమవుతారు అని ఆరోపించారు. ఉత్తర బెంగాల్‌లో తేయాకు తోటల పునఃప్రారంభం గురించి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఆమె మంగళవారం సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

‘పశ్చిమబెంగాల్‌లో భాజపా ఎంపీలు అధిక భాగం ఉత్తరాది జిల్లాలకు చెందిన వారే ఉన్నా.. ఇక్కడి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదు. రాష్ట్రంలోని తేయాకు తోటలను పునఃప్రారంభించేలా చేస్తామని వారు లోక్‌సభ ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఈ ప్రాంతం కోసం భాజపా నాయకులు ఏం చేయలేదు. ఒకవేళ ఏదైనా అభివృద్ధి చేస్తే ఏంటో వివరించాలి. మా ప్రభుత్వం పేదల పక్షపాతి. రైతులు, గిరిజనులకు ప్రాధాన్యత మా ప్రభుత్వంలోనే ఉంటుంది. రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేం వాటిని అనుమతించం’ అని మమతా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె పలువురు తేయాకు తోటల పెంపకందారులకు భూమి పట్టాలను అందజేశారు. 

కళాకారులతో.. ‘దీదీ’ నృత్యం
సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొన్న దీదీ.. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో పాల్గొని స్టెప్పులేశారు. ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలపై విరుచుకుపడే మమతా ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఇదీ చదవండి

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలివే!
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని