ఎంపీ పట్ల ఇంతటి జులుం.. సామాన్యుల గతేంటి?

తాజా వార్తలు

Published : 16/05/2021 00:24 IST

ఎంపీ పట్ల ఇంతటి జులుం.. సామాన్యుల గతేంటి?

బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రవర్తించడం దారుణమని పేర్కొన్నారు. కస్టడీలో ఉండేవారిని కొట్టే హక్కు పోలీసులకు లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఇలాంటి చర్యలు ఫ్యాక్షన్‌ను తలపిస్తున్నాయని, ఎంపీ పట్ల ఇంతటి జులుం ప్రదర్శిస్తే ఇక సామాన్యుల గతేంటని చంద్రబాబు ప్రశ్నించారు. నడవలేని స్థితిలో ఎంపీ ఉన్నారంటే ఎంతగా హింసించారో తెలుస్తోందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని