నరసరావుపేటలో వైకాపా, జనసేన వర్గాల ఘర్షణ

తాజా వార్తలు

Published : 20/05/2021 01:16 IST

నరసరావుపేటలో వైకాపా, జనసేన వర్గాల ఘర్షణ

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో వైకాపా, జనసేనవర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో జరిగిన ఈ గొడవలో ఇరువర్గాల వారు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా.. ఇరు వర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై రెండు వర్గాల వారు  నరసరావుపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వైకాపా వర్గీయులే గొడవకు కారణమని జనసేన తరఫున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని సర్పంచి గౌషియా బేగం వాపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని