GHMC: లింగోజిగూడ కాంగ్రెస్‌ కైవసం

తాజా వార్తలు

Updated : 03/05/2021 12:15 IST

GHMC: లింగోజిగూడ కాంగ్రెస్‌ కైవసం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి భాజపా అభ్యర్థిపై గెలుపొందారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్‌లో భాజపా కార్పొరేటర్‌ గెలుపొందారు. ఆయన మృతిచెందటంతో ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ స్థానంలో పోటీకి తెరాస తమ అభ్యర్థిని నిలపలేదు. తాజా గెలుపుతో జీహెచ్‌ఎంసీలో 3 స్థానాలకు కాంగ్రెస్‌ బలం పెరిగింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని