సానుభూతికోసమే జగన్‌ లేఖలు: నారాయణ

తాజా వార్తలు

Published : 05/06/2021 15:00 IST

సానుభూతికోసమే జగన్‌ లేఖలు: నారాయణ

తిరుపతి: బెయిల్‌ రద్దవుతుందన్న అనుమానంతోనే సానుభూతి కోసం కేంద్రంపై పోరాడుతున్నట్టు సీఎం జగన్‌ బలం కూడగడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ...సీఎం జగన్‌ అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శిస్తూ జార్ఖండ్‌ సీఎం లేఖ రాసినప్పుడు వారించిన జగన్‌.. ఇప్పుడు ఎందుకు పక్క రాష్ట్రాల సీఎంలతో బలం కూడగడుతున్నారని ప్రశ్నించారు. 

మాజీ మంత్రి ఈటల భాజపాలోకి వెళితే నష్టం కేసీఆర్‌కే అని నారాయణ అన్నారు.  పశ్చిమ బెంగాల్‌లా తెలంగాణ మారకుండా కేసీఆర్‌ జాగ్రత్త పడాలని సూచించారు.  లక్షద్వీప్‌ను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకే కేంద్రంలోని భాజపా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లను దెబ్బతీసేలా ప్రపుల్‌ పటేల్‌ వ్యవహరిస్తున్నారన్నారు. ఈనెల 8న లక్షద్వీప్‌ ప్రజల పోరాటానికి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా వామపక్షాలు ఆందోళన నిర్వహించనున్నట్టు నారాయణ ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని