కాన్వాయ్‌తో హుజూరాబాద్‌కు ఈటల!

తాజా వార్తలు

Updated : 03/05/2021 17:59 IST

కాన్వాయ్‌తో హుజూరాబాద్‌కు ఈటల!

హైదరాబాద్‌: భూకబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన సొంత హుజూరాబాద్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో తన సొంత నియోజకవర్గానికి పయనమయ్యారు. భారీ సంఖ్యలో కార్లతో అనుచరులు, మద్దతుదారులు ఆయన వాహనాన్ని అనుసరించారు. దీంతో జాతీయ రహదారి వెంబడి కోలాహల వాతావరణం నెలకొంది. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో ఈటల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తాజా పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణను అక్కడ కార్యకర్తలు, తన అనుచరులతో చర్చించనున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని