ఈటలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ

తాజా వార్తలు

Published : 07/05/2021 01:51 IST

ఈటలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ

శామీర్‌పేట్‌: రాజకీయంగా జరిగిన విషయాలను పట్టించుకోవద్దని, అవమానకరంగా భావించొద్దని చెప్పేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసినట్లు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ రాత్రి శామీర్‌పేటలోని ఈటల ఇంటికి వచ్చిన కొండా దాదాపు గంటపాటు వివిధ అంశాలపై ఈటలతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను రాజకీయాలపై చర్చించేందుకు ఈటల ఇంటికి రాలేదు. సానుభూతి తెలియజేసేందుకే వచ్చాను. ఈటల సతీమణి జమునా రెడ్డి నా సమీప బంధువు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజలు ఆయన వెంట ఉంటారని చెప్పాను. ఇతర విషయాలు ఏమీ మాట్లాడలేదు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇదొకటి’’ అని కొండా వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని