సోమిరెడ్డిపై క్రిమినల్‌ కేసు కొట్టివేత

తాజా వార్తలు

Published : 21/01/2020 18:11 IST

సోమిరెడ్డిపై క్రిమినల్‌ కేసు కొట్టివేత

అమరావతి: తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నమోదైన క్రిమినల్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల అనంతరం ఇడిమేపల్లి భూముల విషయంలో సోమిరెడ్డిపై ఫోర్జరీతోపాటు పలు సెక్షన్ల కింద నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో నాలుగున్నర గంటల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. దీంతో తన భూములకు సంబంధించి 1933 నుంచి ఉన్న డాక్యుమెంట్లను సోమిరెడ్డి  పోలీసులకు చూపడంతో పాటు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు కేసును రద్దు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని