మా ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారు: జగన్‌

తాజా వార్తలు

Updated : 22/01/2020 11:18 IST

మా ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారు: జగన్‌

అమరావతి: ‘జై అమరావతి’ అంటూ సభలో నినాదాలు చేస్తున్న తెదేపా సభ్యులపై సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి మా సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.. చేతగాకపోతే బయట కూర్చోవాలి. మా సభ్యులను రెచ్చగొట్టి.. ఏదైనా అంటే వారికి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. పదిమంది ఉన్నారు.. వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. స్పీకర్‌ పోడియం మెట్ల వద్ద మార్షల్స్‌ను పెట్టి అక్కడే అడ్డుకోవాలి. మార్షల్స్‌ సాయంతో ఆందోళన చేసేవారిని బయటపడేయాలి’’ అని స్పీకర్‌ను కోరారు. 
శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ...సభ్యుల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇది శాసనసభ అనుకుంటున్నారా? మీ ఇల్లు అనుకుంటున్నారా అని తెదేపా సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద తెదేపా సభ్యులను తీసుకెళ్లి వారి స్థానాల్లో కూర్చోబెట్టాలని మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో మార్షల్స్‌, తెదేపా ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం తెదేపా సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని