సీఎంకు విచక్షణాధికారాలు లేవా?:కొడాలి నాని

తాజా వార్తలు

Updated : 23/01/2020 17:24 IST

సీఎంకు విచక్షణాధికారాలు లేవా?:కొడాలి నాని

అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణ కూడా అవసరమని అనేక కమిటీలు నివేదికల్లో పేర్కొన్నాయని.. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. శాసన మండలిలో తెదేపా వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో జరిగిన చర్చలో నాని మాట్లాడారు.

‘‘మండలిలో తెదేపాకు 34 మంది సభ్యులు ఉన్నారని మాకు తెలియదా? అక్కడ కూడా ఈ బిల్లులపై చర్చ జరగాలనే ప్రవేశపెట్టాం. ఏమైనా సలహాలు, సూచనలు చెబుతారని భావించాం. కానీ.. తెదేపా అధినేత చంద్రబాబు గ్యాలరీల్లో కూర్చొని ఛైర్మన్‌ షరీఫ్‌ను సైగలతో ప్రభావితం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారని పెద్దల సభ (శాసన మండలి) పెట్టారు. ఇప్పుడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితే వస్తే అప్పటి సీఎం ఎన్టీఆర్‌ మండలిని రద్దు చేశారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెంది జగన్‌కు మంచి పేరొస్తుందనే భయం చంద్రబాబుది. అందుకే మండలిలో ఈ విధంగా చేశారు. ఛైర్మన్‌ విచక్షణాధికారాలతో అలా చేశారని చెబుతున్నారు. సీఎంకు విచక్షణాధికారాలు లేవా? తీర్మానం పెట్టి కార్యాలయాలను విశాఖ తరలించాలనుకుంటే ఆపగలిగే శక్తిసామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? వచ్చేసారి చంద్రబాబు శాసనసభ గ్యాలరీల్లోనూ కూర్చొనేలా చేయాలి. మండలిని ఉంచాలా? వద్దా? అనేదానిపై సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని నాని వ్యాఖ్యానించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని