సెలక్టు కమిటీల నియామకంపై ప్రతిష్టంభన

తాజా వార్తలు

Published : 31/01/2020 06:45 IST

సెలక్టు కమిటీల నియామకంపై ప్రతిష్టంభన

ఐదుగురు చొప్పున పేర్లు ఇచ్చిన తెదేపా
పేర్లు ఇచ్చేందుకు వైకాపా విముఖత

ఈనాడు, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్టు కమిటీల నియామకంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ కమిటీలో తమ పార్టీ తరఫున ఎవరినీ సభ్యులుగా నియమించబోమని వైకాపా అంటోంది. తెదేపా ఇప్పటికే రెండు కమిటీలకు ఐదుగురు చొప్పున ఎమ్మెల్సీల పేర్లతో శాసనసభ, మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖలు అందజేసింది. కార్యదర్శికి లేఖలు అందజేసినట్టు ధ్రువీకరణ కూడా పొందింది. సభ్యుల పేర్లను సూచించాల్సిందిగా శాసన మండలి కార్యదర్శి నుంచి ఇంతవరకు రాజకీయ పార్టీలకు లేఖలు వెళ్లలేదు. మండలి ఛైర్మన్‌ శాసన మండలి కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. సెలక్టు కమిటీల నియామకానికి సోమవారం వరకు గడువున్నట్టు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని