రాజధాని భూములపై సీబీఐ విచారణ జరపాలి

తాజా వార్తలు

Published : 04/02/2020 00:50 IST

రాజధాని భూములపై సీబీఐ విచారణ జరపాలి

కేంద్రాన్ని కోరిన వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతిలో భూ క్రయ విక్రయాలపై సీబీఐ విచారణ జరపాలని వైకాపా ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజధానిలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే.. రాష్ట్రంలో పెట్టుబడులు తరలిపోతున్నాయని తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రూ.25 వేల కోట్ల సోలార్‌ పార్కు ఏర్పాటుకు సింగపూర్‌, అబుదాబి ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోబోతున్నామని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని భూముల గురించి ప్రస్తావించారు.

ఒక సీఎం రాజధానిని తిరువూరు వద్ద పెడతామని చెప్పి.. భూములు కొన్న తర్వాత తిరువూరు కాదు.. అమరావతిని ప్రకటించడం ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించడమేనని మిథున్‌రెడ్డి అన్నారు. ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. 4 వేలకు పైగా ఎకరాలు తెలుగుదేశం నేతల చేతుల్లో ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 780 మంది రూ.కోట్లలో పెట్టి భూములు కొన్నారని, ఆదాయపు పన్ను పరిధిలోని లేని వ్యక్తులు ఎలా కొనగలరని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని, ఈ కుంభకోణం బయటకు రావాలని మిథున్‌రెడ్డి అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని