బీసీ నిధులపై జగన్‌ సమాధానం చెప్పాలి

తాజా వార్తలు

Updated : 17/02/2020 14:02 IST

బీసీ నిధులపై జగన్‌ సమాధానం చెప్పాలి

విజయవాడ: రాష్ట్రంలో వైకాపా సర్కార్‌పై టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీల నిధులను ఇతర పథకాలను మళ్లిస్తూ బలహీనవర్గాల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బలహీనవర్గాలు ఎప్పుడూ తెదేపాకు అండగా ఉంటారనే వారిని అణచివేసేందుకు నాడు వైఎస్‌ఆర్‌ కుట్ర పన్నినట్లే ఇప్పుడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి జగన్‌ కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు బలహీన వర్గాలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్‌.. ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. బీసీల నిధులు ‘అమ్మఒడి’ పథకానికి మళ్లించారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ఒక యువకుడు వీడియో పోస్ట్‌ ద్వారా ప్రశ్నిస్తే అతడిని అరెస్టు చేయడంపై అచ్చెన్న మండిపడ్డారు. ఇదే ప్రశ్న ఇప్పుడు తాము అడుగుతున్నామని.. ధైర్యం ఉంటే జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు మంచి చేయడానికి అధికారం ఇస్తే అది తమపై కక్షసాధింపునకు వినియోగిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని