జగన్‌కు ఎవరు సలహాలిస్తున్నారో?: రాజా

తాజా వార్తలు

Published : 22/02/2020 00:23 IST

జగన్‌కు ఎవరు సలహాలిస్తున్నారో?: రాజా

విజయవాడ: మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సృష్టించిన రాజకీయ అనిశ్చితి ఏపీని రాజకీయం సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. విజయవాడలో పర్యటిస్తున్న ఆయనను అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిసి అమరావతి సంక్షోభాన్ని వివరించారు. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వని రీతిలో  ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని రాజా అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడంలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఏపీలో ఎందుకని ప్రశ్నించారు.

ప్రజలతో పోరాటమా?

ప్రజలతో పోరాడటం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాలని రాజా సూచించారు. ప్రజాస్వామ్యంలో  ప్రజలు, రాజకీయ పార్టీల గొంతుకను ప్రభుత్వం వినాలనీ.. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రజల, రాజకీయ పార్టీల గొంతు ప్రభుత్వానికి వినపడట్లేదని ఆరోపించారు. నిరసనకారులు, మహిళలపై దాడులను తమ పార్టీ తరఫున ఖండిస్తున్నట్టు చెప్పారు.  మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని రాజా స్పష్టంచేశారు. రాజధానిగా అమరావతే ఉండాలన్నది తమ నిశ్చితాభిప్రాయమన్నారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని