విదేశాంగ మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

Published : 23/04/2020 00:29 IST

విదేశాంగ మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్: కువైట్‌ నుంచి స్వదేశానికి వచ్చే కార్మికుల జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు ఆయన లేఖ రాశారు. వలస కార్మికుల ఉపాధికి గమ్యస్థానంగా కువైట్‌ ఉందని లేఖలో పేర్కొన్నారు. కరోనా భయాందోళనలతో కువైట్‌ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించిందని.. దీంతో వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారని తెలిపారు. వలస కార్మికులను స్వదేశానికి పంపించేందుకు కువైట్‌ సిద్ధంగా ఉందని.. దాదాపు 15 వేల మంది భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కువైట్‌ నుంచి తరలివచ్చే వారి భద్రత, జీవనోపాధి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్వదేశానికి చేరిన తర్వాత లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడకుండా సరైన రవాణా సదుపాయాలు కల్పించి స్వస్థలాలకు చేరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వారికి జీవనోపాధి, పునరావాసం కల్పించాలని చంద్రబాబు లేఖలో కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని