నా నమ్మకం బలపడుతూనే ఉంది: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 27/05/2020 09:58 IST

నా నమ్మకం బలపడుతూనే ఉంది: చంద్రబాబు

అమరావతి: సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపుతుందనే తన నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో భౌతికదూరం పాటిస్తూ డిజిటల్‌ సోషలైజేషన్‌ దిశగా వెళ్తున్నామంటే దానికి సాంకేతికతే కారణమని స్పష్టం చేశారు. 

ఈసారి జరుగుతున్న డిజిటల్‌ మహానాడు 2020 కూడా అలాంటిదేనని వివరించారు. ఏటా అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా నిర్వహించే మహానాడుకు ఈ సారి లాక్‌డౌన్‌ నిబంధనలు అడ్డొచ్చాయన్నారు. అయినా జూమ్‌ వెబినార్‌ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపిందని వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్‌ రాజకీయ సమావేశం తెలుగుదేశం మహానాడు-2020 అని తెలిపారు. పార్టీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ మొబైల్‌, ట్యాబ్‌లలో జూమ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని డిజిటల్‌ మహానాడులో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని