తెదేపా ఎవరికీ భయపడదు: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 29/05/2020 03:29 IST

తెదేపా ఎవరికీ భయపడదు: చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండో రోజు ఎన్టీఆర్‌కు ఘన నివాళులతో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుష్పాంజలి ఘటించారు. సీనియర్‌ నేతలు, ఇతర నాయకులు నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు రెండో రోజు వేడుకను చంద్రబాబు ప్రారంభించారు. 

తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని మహానాడు వేదికగా తెలుగుదేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ వ్యక్తికాదు.. వ్యవస్థ అని కొనియాడారు. ఆయన జీవితం ఆదర్శమని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ఎవరికీ భయపడదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. సవాళ్లు పార్టీకి కొత్తకాదని స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి శక్తి అని, వారి శక్తి యుక్తులతో మరింత ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎప్పుడు ఎక్కడ అసరముంటే అక్కడ ప్రత్యక్షమవుతానని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన..చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మహానాడులో తీర్మానం ప్రవేశ పెట్టగా.. ఆ అంశంపై బాలకృష్ణ ప్రసంగించారు. తెలుగుజాతికి ఎన్టీఆర్‌ చేసిన సేవలను సీనియర్‌ నేతలు అశోక్‌గజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొనియాడారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని