బిల్డ్‌ ఏపీ పేరుతో సోల్డ్‌ ఏపీగా మార్చారు

తాజా వార్తలు

Published : 29/05/2020 03:25 IST

బిల్డ్‌ ఏపీ పేరుతో సోల్డ్‌ ఏపీగా మార్చారు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

అమరావతి: తెలుగుదేశం పార్టీ పాలనలో అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. మహానాడు రెండో రోజులో భాగంగా ఆయన నేతలతో మాట్లాడారు. ఎన్నో ఇబ్బందులు పడి హెచ్‌సీఎల్‌ సంస్థను తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్‌ ధరల పెంపు వెనుక పెద్ద కుంభకోణమే ఉందని.. యూనిట్‌ విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

వైకాపా పాలనలో కబ్జాలు పెద్దఎత్తున పెరిగాయని లోకేశ్‌ ఆరోపించారు. జే ట్యాక్స్‌ వసూళ్ల పేరుతో మహానాడులో లోకేశ్‌ తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే దీపక్ రెడ్డి దాన్ని బలపరిచారు. మద్యం ద్వారా రూ. కోట్ల మేర జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అనేది జగన్‌ డీఎన్ఏలోనే ఉందన్నారు. విశాఖలోని విలువైన భూములు కొట్టేసేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కరోనా కిట్లు, బ్లీచింగ్‌ పౌడర్, భూ కొనుగోళ్లు అన్నీ అవినీతిమయమేనన్నారు. బిల్డ్‌ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని సోల్డ్‌ ఏపీగా మార్చారన్నారు. తెదేపా హయాంలో ఎన్నో కంపెనీలు తెచ్చేందుకు కృషి చేస్తే.. జగన్‌ వచ్చాక కొత్త మద్యం బ్రాండ్లు తప్ప మరేమీ తేలేదని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని