అమరావతికి పూర్వ వైభవం: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 29/05/2020 03:21 IST

అమరావతికి పూర్వ వైభవం: చంద్రబాబు

ముగిసిన 2రోజుల ‘మహానాడు’

అమరావతి: దేశభద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తెదేపా మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రెండు రోజుల మహానాడు ఇవాళ్టితో ముగిసింది. రెండు రోజుల మహానాడులో 22 తీర్మానాలను ఆమోదించగా.. 52 మంది నేతలు ప్రసంగించారు. తెదేపా అధినేత చంద్రబాబు ముగింపు సందేశం ఇచ్చారు.

‘‘చైనాతో వివాదం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి తెదేపా సహకారం ఉంటుంది. సీఎం జగన్‌ చేసేది విధ్వంసకర పాలన. యువతను ప్రోత్సహిస్తా.. మహిళలకు ప్రాధాన్యమిస్తాను. పవిత్ర జలాలు, మట్టితో పునీతమైన అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. అమరావతిపై తెదేపా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. అభివృద్ధి చేతకాక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు అండగా ఉంటాం’’ అని చంద్రబాబు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని