‘పది పరీక్షలు నిర్వహణ మరో తుగ్లక్‌ చర్య’

తాజా వార్తలు

Published : 16/06/2020 01:22 IST

‘పది పరీక్షలు నిర్వహణ మరో తుగ్లక్‌ చర్య’

హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా కష్టాల్లో పదో తరగతి పరీక్షలను నిర్వహించాలనుకోవడం మరో తుగ్లక్‌ చర్య అవుతుందని విమర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలనుకోవడం అవివేకం అవుతుందన్నారు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతం అవుతోందని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని చంద్రబాబు హితవు పలికారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్ని జిల్లాలకూ కరోనా వ్యాపించిందని ఆరోపించారు. మొదట్లో పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ అంటూ తేలిగ్గా మాట్లాడారని తప్పుబట్టారు. వైకాపా నేతలు కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని