జగన్‌ కక్ష సాధింపులకు తలొగ్గను: జేసీ

తాజా వార్తలు

Updated : 18/06/2020 12:21 IST

జగన్‌ కక్ష సాధింపులకు తలొగ్గను: జేసీ

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్‌ కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదని తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఎన్నో రోజులు పాలించటం సాధ్యం కాదన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో నా బస్సులు, లారీలను నిలిపివేశారు. అయినా నాకు పొలం ఉంది. దాన్ని సాగు చేసుకుంటూ బతకగలను. అంతేగానీ వైకాపా బెదిరింపులకు లొంగేది లేదు. వచ్చే ఏడాది బడ్జెట్‌ తర్వాత నవరత్నాలు అమలును కొనసాగించలేరు. కొనసాగించాలంటే రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మక తప్పదు. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవీ జగన్‌ చేపట్టడం లేదు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు’’ అని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని