సీఐఏకు అన్నివిధాలా అండగా ఉంటాం: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 04/07/2020 19:12 IST

సీఐఏకు అన్నివిధాలా అండగా ఉంటాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: నిర్మాణ పరికరాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇండియా కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫెక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీఐఏ) ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీకి ప్రత్యేక పార్కు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.  ‘‘ రోడ్డు, సాగునీటి ప్రాజెక్టులు సహా పలు నిర్మాణాలతో సీఐఏకు అనేక అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాలపై కొవిడ్ ప్రభావం పడింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనులు కొనసాగుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా పాలన కొనసాగుతోంది. ఎక్స్‌కాన్‌ వంటి కార్యక్రమాలను సీఐఏ హైదరాబాద్‌లో నిర్వహించాలి. సీఐఏ సవాళ్లు, అవకాశాలపై ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలి. స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలి’’ అని కోరారు. మరో వైపు, రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టును సీఐఏ అభినందించింది.  మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని