ప్రభుత్వానికి ఆ అధికారం ఎవరిచ్చారు?

తాజా వార్తలు

Published : 24/07/2020 17:33 IST

ప్రభుత్వానికి ఆ అధికారం ఎవరిచ్చారు?

తెదేపా నేత సోమిరెడ్డి

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌ను ప్రభుత్వం ఎస్‌ఈసీగా పునరుద్ధరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే నిరాకరించడాన్ని ఆయన స్వాగతించారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వపాలన గాడి తప్పిందని, రాజ్యాంగాన్ని విస్మరిస్తోందని సుప్రీం వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయన్నారు. అధికారులంతా పాలకులకు బానిసల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా తప్పు జరిగితే శిక్ష అనుభవించాల్సింది అధికారులేనని హెచ్చరించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని