Sanjay Raut: ‘గతంలో కాంట్రాక్ట్‌ హత్యలుండేవి.. ఇప్పుడు ప్రభుత్వ హత్యలు’

తాజా వార్తలు

Published : 18/10/2021 01:39 IST

Sanjay Raut: ‘గతంలో కాంట్రాక్ట్‌ హత్యలుండేవి.. ఇప్పుడు ప్రభుత్వ హత్యలు’

ముంబయి: ‘మహారాష్ట్రలో రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసేందుకు గతంలో కాంట్రాక్ట్ హత్యలుండేవి. ఇప్పుడు ఈ స్థానాన్ని ‘ప్రభుత్వ హత్యలు’ భర్తీ చేశాయ’ని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కాంట్రాక్ట్ కిల్లర్స్‌గా పనిచేస్తున్నాయని ఆరోపించారు. తరచుగా దాడులు నిర్వహించడం అనేది ఎటువంటి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారంగా మారిందని, ఇదో కొత్త పాలసీ అని ఎద్దేవా చేశారు. ‘ప్రైవేటు ఫండ్‌ అంటూ ఇటీవల పీఎం కేర్స్ నిధుల వివరాలు వెల్లడించలేదు. కానీ.. అవన్ని ప్రధానమంత్రి పేరు మీదే సేకరించినవి కదా’ అని ప్రశ్నించారు. 
ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై కొన్ని రోజులుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అదే పార్టీకి చెందిన నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇంటిపై ఇప్పటికే ఐదుసార్లు సీబీఐ సోదాలు చేసింది. వీటితోపాటు ఎన్‌సీబీ కూడా మరికొంతమంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుపుతోంది. ఇలా కేవలం ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసుకొనే కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని సంజయ్‌ రౌత్‌ గతంలోనూ విమర్శలు చేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ సైతం ఇటీవల ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించిన భాజపా.. అందులో విఫలం కావడంతోనే అధికార కూటమి(మహా వికాస్‌ అఘాడీ)కి చెందిన నేతలపై దాడులకు ఉపక్రమించిందని ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని