అవకాశవాదులకు స్థానం లేదు: హరీశ్‌రావు

తాజా వార్తలు

Updated : 10/07/2021 19:18 IST

అవకాశవాదులకు స్థానం లేదు: హరీశ్‌రావు

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులు ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీని చేపడతామని.. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని చెప్పారు. స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టుకునేందుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను అవమానించారని.. తెలంగాణ గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి బయటకు పంపారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్‌ వారసులమని చెప్పుకుంటూ కొంత మంది రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని