Harish Rao: అక్కలారా.. ఓటేసేందుకు వెళ్లేటప్పుడు జర సిలిండర్‌కు దండం పెట్టిపోండి!

తాజా వార్తలు

Updated : 09/10/2021 16:22 IST

Harish Rao: అక్కలారా.. ఓటేసేందుకు వెళ్లేటప్పుడు జర సిలిండర్‌కు దండం పెట్టిపోండి!

హుజూరాబాద్‌ : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. అధికార తెరాస తరఫున మంత్రులు, ఇతర నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేసిన మంత్రి హరీశ్‌రావు లక్ష్మాజీపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపా హయాంలో పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెంచుతూ  సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

‘‘ఈటల రాజేందర్‌ ఆరుసార్లు గెలిచారు.. ఆయనకు వ్యాపారం కూడా ఉంది. ఇక్కడి నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహించినా ఈటల ఏమీ చేయలేదు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు రెండేళ్లు అవకాశం ఇవ్వండి. పని చేయించి చూపిస్తా. భాజపా గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కరెంటు మీటర్లు తిరిగినట్టు తిరుగుతాయ్‌. అలా పెరగాలా..? తెరాస గెలిచి పేద ప్రజల సంక్షేమం కొనసాగాలా? ఆలోచించి ఓటేయండి. ఈ నెల 30న ఓటేసేందుకు పోయేటప్పుడు అక్కాచెల్లెళ్లు ఒక్కసారి వంటగదిలోకి పోయి సిలిండర్‌కు దండం పెట్టి వెళ్లండి. యువత కష్ట పడి పనిచేయాలి.. భవిష్యత్తు మనదే’’ అని హరీశ్‌ వ్యాఖ్యానించారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని