కేసీఆర్‌ను తిడితే ఓట్లు వస్తాయా?: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 08/07/2021 16:46 IST

కేసీఆర్‌ను తిడితే ఓట్లు వస్తాయా?: కేటీఆర్‌

హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో సింగరేణి కోల్‌ మైన్స్‌ భారతీయ మజ్దూర్‌సంఘ్‌ అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్యతో పాటు ఆయన అనుచరులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...  సింగరేణి కార్మికులకు 13 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యక్ష పాత్ర ఉందని, 25 నుంచి 30 నియోజకవర్గాల్లో కార్మికులు ఉన్నారని తెలిపారు. ఆ ప్రాంతాల్లో కార్మికులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సంఘాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత స్థానిక ప్రతినిధులపై ఉందని స్పష్టం చేశారు. 

తెలంగాణలో తెరాసను ఢీకొట్టే వాళ్లెవరూ లేరని తెలిపారు. కేసీఆర్‌ను తిడితే ఓట్లు వస్తాయనుకోవడం వెర్రితనం అవుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మాదిరిగా ప్రజలను ప్రేమించడం నేర్చుకుంటే కాస్తో.. కూస్తో ఓట్లు పడతాయని హితవుపలికారు. త్వరలోనే దేశానికే పాఠాలు చెప్పే దిశగా తెలంగాణ తయారవుతుందని మంత్రి వివరించారు. మొన్నటి దాకా సోనియాను తెలంగాణ బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు భాజపా ఏం చేసింది?

‘‘అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు కానీ, తెలంగాణలో రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. దుబ్బాకలో గెలిచి జీహెచ్‌ఎంసీలో నాలుగు సీట్లు రాగానే  భాజపా నేతలు ఎగిరెగిరి పడ్డారు. సాగర్‌లో బొక్కబోర్లా పడ్డారు. డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 77 నియోజకవర్గాల్లోని 10లక్షల మంది విద్యావంతులు ఓట్లు వేశారు. భాజపాకు ఉన్న సిట్టింగ్‌ సీటు కూడా పోయింది. మున్సిపాలిటీల్లో కూడా మొత్తం గెలిచాం. తెలంగాణలో పోటా పోటీగా పాదయాత్రలు ప్రకటించారు.  పాదయాత్ర చేస్తే మీ ఆరోగ్యానికే మంచిది. తెలంగాణకు భాజపా ఏం చేసిందో నాయకులే చెప్పాలి. మిషన్‌ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినా.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకి కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. తెలంగాణను చూసి కేంద్రం.. పీఎం కిసాన్‌, జలజీవన్‌ యోజన వంటి పథకాలు పెట్టింది. తెరాస లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని