సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎల్‌.రమణ

తాజా వార్తలు

Updated : 09/07/2021 12:06 IST

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎల్‌.రమణ

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీ మార్పు వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఇవాళ సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్‌.రమణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

సీఎంతో భేటీ అనంతరం ఎల్‌.రమణ మీడియాతో మాట్లాడుతూ... ‘‘వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామన్నారు. తెరాసలోకి రావాలని కేసీఆర్‌ ఆహ్వానించారు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా’’ అని రమణ తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ... ‘‘ ఎల్‌.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానం. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ తెరాసకు అవసరం. రమణను తెరాసలోకి రావాలని కేసీఆర్‌ ఆహ్వానించారు. రమణ సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో తెదేపా నిలబడే పరిస్థితి లేదు’’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రమణకు తెరాస ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని