‘కరోనా వేళ పరీక్షలా?..జోక్యం చేసుకోండి’

తాజా వార్తలు

Published : 26/04/2021 16:26 IST

‘కరోనా వేళ పరీక్షలా?..జోక్యం చేసుకోండి’

గవర్నర్‌కు లేఖ రాసిన లోకేశ్‌

విజయవాడ: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నెలకొన్న విషమ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారనుందని లేఖలో వివరించారు. ఇంటర్‌, పది పరీక్షలకు సుమారు 16.3లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉందన్నారు. దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు ఈ పరీక్షలను వాయిదా వేస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం సరికాదన్నారు. కరోనా వేళ లక్షలాది మంది విద్యార్థులకు, సిబ్బందికి సురక్షిత వాతావరణం కల్పించడం అసాధ్యమన్నారు. కరోనాతో ఏ ఒక్క విద్యార్థి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుందన్నారు. వైరస్‌ నివారణ చర్యలు తీసుకోకపోగా, వ్యాధి విస్తృతికి అవకాశం కల్పించేలా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం శ్రేయష్కరం కాదని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. తమకున్న విశేష అధికారాలతో పరీక్షలు వాయిదా లేదా రద్దు నిర్ణయం తీసుకోవాలని కోరారు. పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు 2లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మద్దతు లభించిందని తెలిపారు. ఈ మేరకు వారు పంపిన అభిప్రాయాలను లోకేశ్‌ తన లేఖకు జతచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని