Mamata Banerjee: నేనేం జ్యోతిష్కురాలిని కాదు..!

తాజా వార్తలు

Updated : 29/07/2021 04:45 IST

Mamata Banerjee: నేనేం జ్యోతిష్కురాలిని కాదు..!

పెగాసస్ హ్యాకింగ్‌పై మండిపడ్డ దీదీ

దిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అత్యయిక పరిస్థితి కంటే ప్రస్తుత పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని మండిపడ్డారు. హ్యాకింగ్ వల్ల తాను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని ఆరోపించారు. ‘అసలు ఏంటీ పెగాసస్? అది లోడ్‌ చేసిన ఒక వైరస్‌. మా భద్రత, గోప్యత అన్నీ ప్రమాదంలో ఉన్నాయి. ఎవరికీ స్వేచ్ఛలేదు. నా ఫోన్ నంబర్ పెగాసస్ జాబితాలో లేనప్పటికీ.. నేను అభిషేక్ బెనర్జీ, ప్రశాంత్ కిశోర్‌తో మాట్లాడితే, నాది కూడా హ్యాక్ అయినట్లే కదా. ఒక ఫోన్ హ్యాక్ అయితే మిగతావి కూడా హ్యాక్ అవుతాయి’ అంటూ మమత బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

మరోపక్క ఈ పెగాసస్ వ్యవహరంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు విపక్ష నేతలు భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే దిల్లీలో ఉన్న మమత మాత్రం ఆ సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా, దీనిపై ఆమె మాట్లాడుతూ.. ఈ అంశంపై జరుపుతోన్న పోరులో తమ పార్టీ ముందువరుసలో ఉందన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో విపక్ష పార్టీలను ఎవరు ముందుకు నడిస్తారనే మీడియా ప్రశ్నకు ఆమె స్పందించారు. ‘నేను జోత్యిష్కురాలిని కాదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తారు. వారికి నేను మద్దతు ఇస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు. 

మరోపక్క పెగాసస్ హ్యాకింగ్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే ఈ స్పైవేర్‌ను మన ఫోన్లలోకి జొప్పించిన కేంద్రం.. ఇప్పుడు ఈ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని ధ్వజమెత్తారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని