‘‘ప్రజలను భయపెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’

తాజా వార్తలు

Updated : 08/05/2021 16:12 IST

‘‘ప్రజలను భయపెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’

మంత్రి కొడాలి నాని

అమరావతి: ప్రజారోగ్యం పట్ల ఏపీ ప్రభుత్వం పూర్తి అవగాహన, బాధ్యతతో ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిమితి మేరకే కరోనా టీకాలు అందుబాటులో ఉంచిందని వివరించారు. టీకాల కోసం రూ.1,600 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు టీకాలు తెప్పిస్తే 10 లక్షల డోసులు వేయించేందుకు సిద్ధం అని మంత్రి అన్నారు. చంద్రబాబు, ఇతర నాయకుల రాజకీయ విమర్శలు సరికాదు అని మండిపడ్డారు. 

కర్నూలు జిల్లా నుంచి ప్రమాదకరమైన వైరస్‌ వ్యాప్తి అంటూ భయపెడుతున్నారని మంత్రి అన్నారు. ప్రజలను భయపెట్టేలా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తెదేపా జూమ్‌ మీటింగ్‌లపైనా నిఘా సంస్థలు కన్ను వేయాలని కోరుతున్నానన్నారు. టీకాల కోసం కంపెనీలు, కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాశామని మంత్రి స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని