విద్యుత్‌ సిబ్బందిపై చేయి చేసుకున్నవారిని గుర్తించండి!

తాజా వార్తలు

Published : 23/05/2021 01:28 IST

విద్యుత్‌ సిబ్బందిపై చేయి చేసుకున్నవారిని గుర్తించండి!

డీజీపీతో మాట్లాడిన మంత్రి జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ విద్యుత్ సిబ్బందిని పోలీసులు ఆపొద్దని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డితో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సిబ్బందిపై చేయి చేసుకున్న పోలీసులపై చర్యలకు మంత్రి ఆదేశించారు. చేయి చేసుకున్నవారిని గుర్తించాలని సూచించారు.అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. నల్గొండ సంఘటనలపై ఎస్పీతోనూ మంత్రి మాట్లాడారు. విద్యుత్‌ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

మరోవైపు, పోలీసుల తీరును నిరసిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు నల్గొండలో ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని