మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు : నామా

తాజా వార్తలు

Updated : 19/06/2021 14:53 IST

మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు : నామా

హైదరాబాద్‌ : నీతి, నిజాయితీలకు కట్టుబడే వ్యక్తిత్వం తనదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల మధుకాన్‌ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తన బలం కేసీఆర్ అని.. తన బలగం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్నా. 40 ఏళ్ల క్రితం మధుకాన్‌ను స్థాపించా. ఎంతో శ్రమించి కంపెనీని విస్తరించా. మధుకాన్‌ ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చెపట్టింది. దేశ సరిహద్దుల్లో క్లిష్టతర ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తున్నాం. చైనా సరిహద్దుల్లోనూ రోడ్ల నిర్మాణం చేపట్టాం. మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్‌ వెంటే ఉంటా’ అని నామా అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని