ప్రభుత్వంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి: రఘురామ

తాజా వార్తలు

Updated : 27/06/2021 11:41 IST

ప్రభుత్వంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి: రఘురామ

దిల్లీ: నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎనిమిదో లేఖ రాశారు. సర్పంచ్‌ల అధికారాల్లో కోత విధించడం ప్రజాస్వామ్యానికి చేటు అని చెప్పారు. గ్రామసభ క్రియాశీలత్వం కోల్పోయి లాంఛనప్రాయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్‌పై స్పష్టత లేకపోవడంతో.. బ్యాంకుల నుంచి నిధులు తీసుకోలేక నిస్సహాయంగా మారారని రఘురామ ఆరోపించారు.

నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని.. పంచాయతీలను ప్రభుత్వమే బలహీన పరుస్తోందనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. అనిశ్చితి మధ్య ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతోందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వం చర్యల్ని వ్యతిరేకిస్తున్నారని.. ప్రస్తుతం వారిలో ఉన్న అసంతృప్తి పైకి కనిపించకపోయినా ఏదో ఒక రోజున అది బయట పడుతుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించాలని రఘురామ కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని