సంపూర్ణ మద్య నిషేధం ఏదీ: రఘురామ

తాజా వార్తలు

Updated : 18/06/2021 08:58 IST

సంపూర్ణ మద్య నిషేధం ఏదీ: రఘురామ

దిల్లీ: ఎన్నికల్లో వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీ సీఎం జగన్‌కు ఆయన తొమ్మిదో లేఖ రాశారు. నిషేధం కంటే మద్యపాన ప్రోత్సాహం ఎక్కువగా ఉందని రఘురామ ఆక్షేపించారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 16 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు. మద్యపానం నిషేధిస్తారని మహిళలు వైకాపాకు ఓటేశారని.. సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. వైకాపా ఎన్నికల హామీలపై ‘నవ హామీలు- వైఫల్యాలు’ పేరుతో ఆయన మొత్తం 9 లేఖలు వరుసగా రాశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని