ఉచిత పథకాలతో నిధుల కొరత: రఘురామ

తాజా వార్తలు

Updated : 25/06/2021 11:25 IST

ఉచిత పథకాలతో నిధుల కొరత: రఘురామ

సీఎం జగన్‌కు ఎంపీ లేఖ

దిల్లీ: ఉచిత పథకాలతో ఏపీ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడుతోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు ఆరో లేఖను ఆయన రాశారు. చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పన్నుల అంశాన్ని రఘురామ అందులో స్తావించారు. చెత్తపై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని చెప్పారు. 

‘‘రవాణా శాఖ ప్రజలపై భారం మోపి రూ.400కోట్లు ఆర్జిస్తోంది. వాహనాల జీవిత పన్నును 3శాతం పెంచారు. రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు పెంచుతున్నారు. గ్రీన్‌ ట్యాక్స్‌ పేరిట జరిమానా వసూలు చేయబోతున్నారు. పన్నుల భారం నుంచి ప్రజలను కాపాడండి’’ అని జగన్‌ను ఎంపీ రఘురామ కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని