Vizag steel plant: విశాఖ ఉక్కు పోరాటంలో పవన్‌ పాల్గొంటారు: నాదెండ్ల

తాజా వార్తలు

Published : 20/09/2021 01:41 IST

Vizag steel plant: విశాఖ ఉక్కు పోరాటంలో పవన్‌ పాల్గొంటారు: నాదెండ్ల

విశాఖపట్నం: విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సరికాదని, ఈ కర్మాగారం భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయంలో జనసేన పార్టీ చాలా స్పష్టతతో ఉందని  ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మొదటి నుంచి అదే స్టాండ్‌కు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ విశాఖ వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాల్గొంటారని వెల్లడించారు. 

 తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంపై దేశం మొత్తం మాట్లాడేలా ముందుకు వెళ్లాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులతో జనసేన నేతలు ఇవాళ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై 220 రోజులుగా తాము చేస్తున్న పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ... ‘‘ మాట తప్పం మడమతిప్పమని గొప్పలు చెప్పుకునే నాయకులు పార్లమెంట్‌లో ఒక మాట, ఇక్కడో మాట మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధిలేని రాజకీయ పార్టీలతో కాకుండా కార్మిక సంఘాలతో ఏర్పాటైన జేఏసీ పోరాటానికి అండగా ఉండాలని పవన్‌ సూచించారు. ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మనందరం కలిసి పోరాటం చేద్దాం’’ అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని